త్రిశక్తి ధామం విశిష్టతలు:

త్రిశక్తి ధామం విశిష్టతలు:

ఇటువంటి తపోభూమి గొప్పతనాన్ని, విశిష్ట శక్తిని భక్తులకు అందించాలనే సంకల్పంతో, శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి దివ్య ఆశీస్సులతో, అన్ని ప్రత్యేకతలు, భక్తులకు అవసరమైన అన్ని సదుపాయాలు ఒకే ప్రాంగణంలోనికి తీసుకుని వచ్చి ఈ ఆలయ నిర్మాణం కావించబడింది.

ప్రతిష్ఠింపబడిన దేవతలు

1. వల్లభ గణపతి ఆలయం
2. శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయం
3. ఉమా నర్మదేశ్వర స్వామి ఆలయం
4. శ్రీ బాలా లలితా త్రిపుర సుందరి ఆలయం
5. 42 అడుగుల శ్రీమన్నారాయణ మూర్తి
6. సర్వ దేవతలు తన శరీరం పై ఉంచుకున్న 42 అడుగుల విశ్వజనని అమ్మవారు ( నవదుర్గ)
7. శ్రీ మహా మృత్యుంజయుడు
8. సప్త మాతృక మూర్తులను
9. అహోరాత్ర యాగంలో ఆవాహన చేయబడిన దశమహా విద్యా స్వరూప మూర్తులు
10. శ్రీ మేధా దక్షిణామూర్తి మందిరం
11. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం
12. శ్రీ దివ్య వ్యాస భగవానుడు మందిరం
13. శ్రీ హనుమంతుని మందిరం
14. శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయం.
ఆలయ సమూహ ముఖద్వారమునే 52 అడుగుల దివ్య ద్వజస్ధంభం తో మొత్తం 29 దేవాలయాలు 49 విగ్రహాలతో శక్తి సంభూతమై నిర్మించినదే ఈ త్రిశక్తి దివ్యధామం.